EX IPS JD LAXMI NARAYANA SLAMS CENTRAL GOVERNMENT OF VIZAG STEEL PLANT PRIVATIZATION NGS
Visakhapatnam: కలెక్టరేట్ ను ముట్టడించిన మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మినారాయణ, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై జేడీ మండిపాటు
కేంద్రంపై పోరాటంలో దూకుడు పెంచారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ. ఇప్పటికే విశాఖ ఉక్కు విషయంలో కొన్ని ప్రతిపానలు సూచించారు. మరోవైపు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. తాజాగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారయణ కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్నివ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ఆయన. అంతకుముందు ప్రధానికి లేఖలు కూడా రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల సాకు చూపి ప్రైవేట్ పరం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావాలి అంటే ఏం చేయాలో చెబుతూ కొన్ని ప్రతిపాధనలు కూడా సూచించారు. అయినా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం. దీంతో ఆయన కూడా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నేరుగా విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు.
కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇప్పటికే ఉద్యమాన్ని తీవ్ర ఉధృతం చేశాయి. రోజుకో రూపంలో నిరసనలు తెలియజేస్తున్నాయి. కొందరు కార్మికులు సుమారు 50 రోజుల నుంచి రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే సమ్మెకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చారు. ఏ క్షణమైనా సమ్మెకు దిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మొన్న ఏపీ బంద్, తరువాత భారత్ బంద్ కి కూడా పిలుపు ఇచ్చారు. బీజేపీ, జనసేన మినాహా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్ కు మద్దతు తెలపడంతో విజయవంతమయ్యాయి. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నాయి కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు నిర్వాసితులు. ఇకపై ఉద్యమాన్ని రాజకీయంగానూ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
తాజాగా కార్మిక సంఘాలు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ కలక్టరేట్ ముట్టడిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో నగరంలోని సరస్వతీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా వచ్చిన నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. పోటెత్తిన జన ప్రవాహంతో కలెక్టరేట్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అడ్డుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఉక్కు ఉద్యోగుల ర్యాలీకి పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.
కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న జేడీ లక్ష్మీ నారాయణ నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడుతూ.. . విశాఖ ఉక్కు ప్రజల గుండె చప్పుడని, ప్రైవేటీకరణ చేయడం తగదని పేర్కొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరును ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అందరి కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవాలని.. ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగం అవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. తమతో కలిసి వచ్చే వారందరితో చర్చించి పోరాటాన్ని మరిన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నారు జేడీ లక్ష్మి నారాయణ.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.