news18-telugu
Updated: February 9, 2020, 10:47 AM IST
జగన్, ఏబీ వెంకటేశ్వరరావు(ఫైల్ ఫోటో)
నిన్న రాత్రి డీజీపీ స్థాయిలోని సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజన్స్ చీఫ్ ఏవీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఏబీ వెంకటేశ్వర్రావు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. అక్రమాల కారణంగా నాపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్ట పరంగా ముందుకు వెళ్తాన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు.దీనిపై ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు.

ఏపీ వెంకటేవ్వర్రావు లేఖ
1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. ఏడీజీపీగా పనిచేసినప్పుడు ఆయన నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారు. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ అనుమతి లేనిదే విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌ను వీడి వెళ్లరాదని పేర్కొంది. మునుపటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వైసీపీ ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.డీజీపీ స్థాయిలోని సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజన్స్ చీఫ్ ఏవీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారన్న ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఆయన సస్పెన్షన్‌కు ఉన్న కారణాలు, ఆయన అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారో తెలియజేస్తూ ప్రభుత్వం కొన్ని వివరాలను తెలియజేసింది.
ప్రభుత్వం చెప్పిన చెప్పిన కారణాలు:
- నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు
- ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు
- ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ
- విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొన్న ప్రభుత్వం
- విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
- నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
- రాష్ఠ్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణ
- కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ
- కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని ఆరోపణ
- విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ఆరోపణ
- ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని ఆరోపణ
- నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ
- ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని ఆరోపణ
- కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణ
- వెంకటేశ్వరరావు కుమారుడికి చెందిన కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా ఇజ్రాయెల్ కంపెనీతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
February 9, 2020, 10:39 AM IST