మరింత విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యం... ఎయిమ్స్‌కు ప్రముఖులు

స్వయంగా శ్వాస తీసుకోవడానికి జైట్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

news18-telugu
Updated: August 19, 2019, 9:30 AM IST
మరింత విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యం... ఎయిమ్స్‌కు ప్రముఖులు
అరుణ్ జైట్లీ
  • Share this:

ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాసకోశ సమస్యలతో పాటు కిడ్నీలు పనిచేయని స్థితిలో 10 రోజుల క్రితం నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స  పొందుతున్నారు.  అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి, నిన్న మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా మారినట్టు వైద్య ఆరోగ్య వర్గాలు ధ్రువీకరించాయి.

నిన్న సాయంత్రం జైట్లీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బెలూన్ పంప్ (ఐఏబీపీ) ద్వారా శ్వాస అందిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. స్వయంగా శ్వాస తీసుకోవడానికి జైట్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించింది. వైద్యులు ఆయనకు డయాలసిస్ నిర్వహించనున్నారు.ఈ విషయం తెలుసుకున్న తరువాతనే అమిత్ షా తదితరులు స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జైట్లీకి ఎయిమ్స్ కార్డియో అత్యవసర విభాగంలో ఐదుగురు వైద్యుల బృందం చికిత్సను అందిస్తోంది. నిన్న సాయంత్రం పలువురు బీజేపీ నేతలు హాస్పిటల్ కు వచ్చి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి .. జైట్లీ ఆరోగ్యంపై ఆరా తీశారు.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు