పోలీసులూ జాగ్రత్త.. చంద్రబాబు వార్నింగ్..

టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు పక్షపాతంలో వ్యవహరిస్తున్నారని, కానీ.. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

news18-telugu
Updated: December 2, 2019, 4:26 PM IST
పోలీసులూ జాగ్రత్త.. చంద్రబాబు వార్నింగ్..
చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు పక్షపాతంలో వ్యవహరిస్తున్నారని, కానీ.. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తమ పార్టీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పారు. ఈ రోజు కర్నూలులో పర్యటించిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కోడి కత్తి కేసు గురించి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ కేసు గురించి పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా సొంత చిన్నాన్నను ఎవరు హత్య చేశారన్నది చెప్పలేకపోతున్నారని విమర్శించారు. అటు.. రాష్ట్రలో ఇసుక కొరత కారణంగా ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నపుడు ఉచితంగా ఇసుకను అందజేశామని, వైసీపీ సర్కారు లారీ ఇసుక ధరను మూడు రెట్లు పెంచిందని అన్నారు.

ఇసుక పాలసీని ఎందుకు మార్చారో చెప్పాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. ఏపీలో మాత్రం దొరకని ఇసుక.. ఇతర రాష్ట్రాలకు ఎలా తరలివెళ్తోందని అడిగారు. వైసీపీ నేతలే ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపించారు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>