Home /News /politics /

Konijeti Rosaiah: అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత.. ఆర్థిక నిపుణుడిని కోల్పోయిన రాష్ట్రం.. ప్రముఖల ప్రశంసలు

Konijeti Rosaiah: అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత.. ఆర్థిక నిపుణుడిని కోల్పోయిన రాష్ట్రం.. ప్రముఖల ప్రశంసలు

రోశయ్య ఇక లేరు

రోశయ్య ఇక లేరు

konijeti Rosaiah: అజాత శత్రువుగా.. ఆర్థిక నిపుణుడిగా.. ప్రత్యర్థులపై పంచులు విసరడంలో ధీటైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిరు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు.. ఆయనతో పని చేసిన నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  Konijeti Rosaiah: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య  (Konijeti Rosaiah) మరణం దేశ రాజకీయాలకు తీరని లోటే.. ఆయన  లో-బీపీతో అకస్మాత్తుగా పడిపోవడంతో  వెంటనే కుటుంబ సభ్యులు  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. కాసేపు ఆయన భౌతికకాయాన్ని బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంచారు.  రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా (Guntur District) వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు.  తరువాత కాంగ్రెస్‌  పార్టీ (Congress Party)లో కీలక నేతగా ఎదిగారు. ఆయన మరణంపై ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన లేని లోటు తీరనది అని.. ప్రముఖ ఆర్థిక నిపునుడిని రాష్ట్రం కోల్పోయిందని ఆయనతో పని చేసిన నాటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు.

  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు (Telangana CM Chandra Sekhar Rao) సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు.

  ఇదీ చదవండి : లోకేష్ ను చంద్రబాబే ఓడించారా..? ఆ పదవికి అడ్డుపడతారని భావించారా..? మంత్రి సంచలన వ్యాఖ్యలు

  మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Y S Jagan Mohan Reddy) సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  ఇదీ చదవండి : ఈ ఇడ్లీ టేస్ట్ ఒక్కసారి చూస్తే చాలు.. మళ్లీ మళ్లీ తింటారు.. టేస్టే కాదు హెల్తీ కూడా

  మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య మృతి బాధాకరమన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని తెలిపారు. వివాదరహితుడిగా నిలిచారన్నారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు.

  ఇదీ చదవండి : బీ అలర్డ్.. గంటకు 100కి.మీ వేగంతో గాలులు.. ఎగసిపడుతున్న రాకసి అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

  మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య  మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సమున్నత వ్యక్తిత్వం,  విషయపరిజ్ఞానం కలిగి, విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రోశయ్య అన్నారు.

  ఇదీ చదవండి : అది నిజమని నిరూపిస్తే బొత్స రాజీనామ చేస్తారా..? రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గోరంట్ల విమర్శ

  మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప వక్త, ఆర్ధిక మంత్రిగా అపార అనుభవం ఉన్న నాయకుడు, అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఘనత ఆయనదే అని అన్నారు. రోశయ్య మృతితో రాష్ట్రం గొప్ప అనుభవశాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఏపీ రాజకీయాలు.. స్ట్రాటజీ ఏంటి.. నడిపిస్తున్నది ఎవరు? ఆయన మనసులో ఏముంది?

  రోశయ్య మృతి పట్ల టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్ నక్కా ఆనంద్ బాబు ప్రగాడ సంతాపం తెలిపారు. వేమూరులో పుట్టి రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించారన్నారు. చివరి వరకూ తాను నమ్మిన సిద్ధాంతాలతో రోశయ్య పనిచేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర రోశయ్యకు మాత్రమే దక్కుతుందని నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు.

  ఇదీ చదవండి : సీఎం ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తి.. ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక..ఏముంది?

  మాజీ సీఎం  రోశయ్య అకాల మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి శిష్యుడు రోశయ్య అని అన్నారు.

  ఇదీ చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..?

  మాజీ సీఎం రోశయ్య అకాల మరణం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ చతురత కలిగిన సీనియర్ నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులు రోశయ్య అని అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానన్నారు.

  ఇదీ చదవండి : ఆ జిల్లాలో టీడీపీ దూకుడు.. అధికార పార్టీకి వరుస షాక్ లు

  ఉమ్మడి ఏపీ సీఎంగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లుగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య ఇక లేరన్న వార్త బాధిస్తోందని గంటా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Rosaiah

  తదుపరి వార్తలు