EX CENTRAL MINSTER ASHOK GAJAPATHI RAJU SLAPS A WOMAN IN VIZIANAGARAM NGS
Ashok Gajapathi Raju slaps a woman: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపై పూలు జల్లిన మహిళపై ఆయన చేయి చేసుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపై పూలు జల్లిన మహిళపై ఆయన చేయి చేసుకున్నారు.
విజయనగరం జిల్లాలో మహిళా దినోత్సవం రోజు మహిళకు ఘోర అవమానం జరిగింది. ప్రచారానికి వచ్చిన మహిళపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చేయి చేసుకున్నారు. ఆమె తనపై పూలు జల్లిందనే ఆగ్రహంతో.. ఊగిపోయిన ఆయన ఒక్కసారిగా మహిళపై తిరగబడ్డారు.
తమ అభిమాన నేత వచ్చారనే గౌరవంతో మహిళ పువ్వులు చల్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు ఆవేశంతో ఊగిపోయారు. అయితే ఆయనకు ఎందుకు కోపం వచ్చింది అన్నది ఎవరికీ అర్థం కాలేదు. ముందుకు వెళ్తున్న అశోక్ గజపతిరాజు మళ్లీ తిరిగి వచ్చి.. ఆవేశంతో రగిలిపోతూ మహిళపై దాడి చేశారు. అక్కడే ఉన్న ఇతర నేతలు ఆయన్ను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈ వీడియోపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తారనే ఉద్దేశంతో మైక్ ఆపేయమని టీడీపీ నేతలు కోరడం క్లియర్ గా రికార్డు అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మాజీ మంత్రి.. అందులోనూ సౌమ్యుడిగా పేరు ఉన్న అశోక్ గజపతి రాజు చర్యపై వైసీపీ సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి..
ఎన్నికల్లో వరుస ఓటములతో ఇలా టీడీడీపీ నేతలు ఫ్రస్టేషన్ కు గురవుతున్నారని.. వారి చర్యలు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లలో ఓటమి తప్పదని అర్ధమవుతోందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మొన్న ఓ అభిమానిపై ఎమ్మెల్యే బాలయ్య చేయచేసుకున్నారు. అది కూడా వీడియో తీశాడనే చిన్న కారణంతోనే.. ఆ వెంటనే ఆ వీడియో వైరల్ అవ్వడంతో.. అభిమానితో టీడీపీ నేతలు వివరణ ఇప్పించారు. తన అభిమాన నటుడు చేయ తనను తాకడం చాలా ఆనందంగా ఉంది అంటూ దెబ్బ తిన్న అభిమాని వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి అయ్యి ఉంఢి.. ఇంత పెద్ద వయసులో ఒక మహిళపై చేయి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నాయి వైసీపీ, సహా ఇతర పార్టీలు.
మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు సెల్ఫ్ గోల్స్ కొంపముంచే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే హిందూపురం ఇష్యూని అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. అటు విజయవాడలో వర్గ పోరు కూడా విపక్షాలకు అస్త్రంగా మారింది. ఇప్పుడు అశోక్ గజపతి రాజు చర్యతో టీడీపీ అధిష్టానం తలపట్టుకోవాల్సి వస్తోంది.
అటు సంచయితా గజపతి రాజు సైతం ఈ ఘటనపై స్పందించారు. అంతర్జాతీయ దినోత్సవం జరుపుకునే తీరు ఇదేనా? పురుషు అహంకార భావజాలంతో ఉన్న. . ఒక మహిళా ద్వేషి నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తాం అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు.