ప్రజాకూటమి గెలిస్తే నేనే సీఎం: సర్వే సత్యనారాయణ

Telangana assembly elections 2018|కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్లు చాలా మందే ఉంటారు. అందుకు తగ్గట్టే.. ఎన్నికల హడావిడి మొదలయ్యాక కొందరు నేతలు సీఎం రేసులో మేమున్నామంటూ పరోక్షంగా తమపేర్లను ప్రకటించుకున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ సైతం సీఎం రేసులో ఉన్నానంటున్నారు.

news18-telugu
Updated: December 4, 2018, 10:09 PM IST
ప్రజాకూటమి గెలిస్తే నేనే సీఎం: సర్వే సత్యనారాయణ
survey satyanarayana file
  • Share this:
టీఆర్ఎస్ గెలిస్తే కచ్చితంగా కేసీఆరే సీఎం అవుతారు. మరి ప్రజాకూటమి గెలిస్తే ఎవరు సీఎం అవుతారు? ఇదే ప్రశ్న చాలారోజులుగా జనాల్లో మెదులుతోంది. అయితే కూటమి నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రాలేదు. అందుకు కారణం, నిర్ణయాధికారం అధిష్ఠానం చేతుల్లో ఉండడమే. అయితే కొందరు నేతలు మాత్రం సీఎం రేసులో తామున్నామంటూ పరోక్ష ప్రకటనలు చేశారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం .. సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు.

ప్రజాకూటమి తరపున కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సర్వే సత్యనారాయణ.. అవకాశం వస్తే తాను సీఎం అవుతానని చెప్పారు. దళిత ముఖ్యమంత్రి హామీని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంగలో తొక్కారని.. ఈసార ప్రజాకూటమి అధికారంలోకి వస్తే.. దళితుడిగా తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దళితుణ్ని ముఖ్యమంత్రి చేయాలని భావిస్తే.. ఆ అవకాశం తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు సీఎం రేసులో ఉన్నట్టు ప్రకటించుకున్నారు. అయితే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ సైతం సీఎం రేసులో ఉన్నానని ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
Published by: Santhosh Kumar Pyata
First published: December 4, 2018, 10:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading