మాజీ స్పీకర్ కోడెలకు మరో షాక్...

గడచిన ఐదేళ్ళుగా స్పీకర్ గా తండ్రికున్న అధికారాలను అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు శివరామ్, కూతులు విజయలక్ష్మిలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: August 10, 2019, 1:54 PM IST
మాజీ స్పీకర్ కోడెలకు మరో షాక్...
కోడెల శివ ప్రసాద్
  • Share this:
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కేసులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కోడెల కుటుంబానికి అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ఉన్న మోటారు వెహికల్ షో రూములను మూయించేశారు. గడచిన ఐదేళ్ళుగా టూ వీలర్లు అమ్ముతున్నప్పటికి కట్టాల్సిన పన్నులను మాత్రం ఎగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకనే శనివారం అకాస్మత్తుగా దాడులు చేసిన అధికారులు కోడెల కుటుబానికి చెందిన రెండు షో రూములను మూయించేశారు.

గడచిన ఐదేళ్ళుగా స్పీకర్ గా తండ్రికున్న అధికారాలను అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు శివరామ్, కూతులు విజయలక్ష్మిలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. వీరిద్దరిపై పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. వీరిద్దరి అరెస్ట్‌కు అధికారులు సిద్దమైన.. వాళ్లు మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కోడెల ఫ్యామిలీ అరాచకాలపై నియోజకవర్గ ప్రజలు భగ్గుమన్నారు.  తమ దందాలకు, అరాచకాలకు, వసూళ్ళ కోసం కోడెల  అధికారాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు.


మరోవైపు కోడెల నాయకత్వం తమకొద్దంటూ సత్తెనపల్లికి చెందిన పలువురు టీడీపీ తమ్ముళ్లు..  చంద్రబాబును కలిశారు. తమకు కొత్త ఇంఛార్జ్‌ను నియమించాలంటూ కోరారు. . సత్తెనపల్లి పట్టణంలో పాత టీడీపీ కార్యాయలం తిరిగి ప్రారంభించాలని... కోడెల నాయకత్వం తమయు అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీనీపై టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు