వైసీపీలో చేరాలనుకుంటే... మాజీ మంత్రి గంటా కీలక వ్యాఖ్యలు

అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నామని జగన్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. శివరామకృష్ణ కమిటీ ప్రకారమే అప్పుడు నిర్ణయం తీసుకున్నామన్నారు గంటా.

news18-telugu
Updated: September 1, 2019, 4:12 PM IST
వైసీపీలో చేరాలనుకుంటే... మాజీ మంత్రి గంటా కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు
  • Share this:
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత కొన్నిరోజులుగా పార్టీ మారుతారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరన్నారు గంటా. రాజధానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారని..  కానీ మంత్రి బొత్స మాత్రం మాత్రమే పదేపదే మాట్లాడుతున్నారన్నారన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ  రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు గంటా. అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నామని జగన్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. శివరామకృష్ణ కమిటీ ప్రకారమే అప్పుడు నిర్ణయం తీసుకున్నామన్నారు గంటా. బీసీల మనోభావాలు దెబ్బ తినడం వల్లే విజయనగరం జిల్లాలో ఓటమి పాలయ్యామన్నారు. టికెట్ల కేటాయింపులో సమతుల్యత లోపించడంతో నష్టం జరిగిందన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ గురించి మాట్లాడుతూ.. ఆయనను తాను ఒక మంత్రిగా పరిగణించడం లేదని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాస్.


గత కొద్ది రోజులుగా గంటా వైసీపీలో చేరుతారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై స్పందిస్తూ గంటా పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు రాజధాని అంశంపై టీడీపీ తరపున స్పందించిన గంటా శ్రీనివాసరావు... విశాఖను ఏపీకి ఆర్థిక రాజధాని చేయాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన తెరపైకి తీసుకొచ్చిన ఈ డిమాండ్‌పై టీడీపీలోనూ చర్చ మొదలైందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే పార్టీ మారే విషయంలో గంటా శ్రీనివాసరావు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు