చంద్రబాబుకు చేయినొప్పి... హైదరాబాద్‌కు మాజీ సీఎం

చేతికి కట్టుకట్టుకొనే... మంగళవారం గుంటూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరయ్యారు. అయితే డాక్టర్లు ఆయనకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

news18-telugu
Updated: August 14, 2019, 7:50 AM IST
చంద్రబాబుకు చేయినొప్పి... హైదరాబాద్‌కు మాజీ సీఎం
చంద్రబాబుకు చేయినొప్పి
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుడి చేతికి కట్టుతోనే... మంగళవారం గుంటూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరయ్యారు. అయితే డాక్టర్లు ఆయనకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడిన మాజీ సీఎం ప్రజలు తిరగబడితే రాష్ట్రంలో వైసీపీ నిలువదన్నారు. అధికారంలోకి వచ్చామనే గర్వంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తాము కూడ ఇలానే వ్యవహరిస్తే వైఎస్‌ఆర్‌సీపీ ఉండేదే కాదని  చంద్రబాబు గుర్తు చేశారు.

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇలానే వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగని పరిస్థితి ఆ పార్టీకి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.  బెదిరిస్తే భయపడిపోతామనే భావనలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉన్నారన్నారు. అరాచకాలు కొనసాగిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతోందని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>