జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి ఫ్యూచర్... బీజేపీ నేత వ్యాఖ్యలు

జూనియర్‌ ఎన్టీఆర్‌పై మాజీ యాంకర్, బీజేపీ నేత శ్వేతారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: September 18, 2019, 2:47 PM IST
జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి ఫ్యూచర్... బీజేపీ నేత వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో
  • Share this:
టీడీపీలో ఎంతమంది ఉన్నా... ఆ పార్టీని ముందుకు నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందని ఒకప్పటి యాంకర్, బీజేపీ నాయకురాలు శ్వేతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించిన శ్వేతా రెడ్డి... ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తంలో టీడీపీని లీడ్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందని అన్నారు. చాలామంది ఇప్పుడు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం అంటున్నారని... కాని తాను మాత్రం పదేళ్ల క్రితమే జూనియర్‌లోని ఆ స్పార్క్‌ను గుర్తించానని శ్వేతారెడ్డి తెలిపారు. అయితే ఈ విషయంలో ఏం జరుగుతుందన్నది ఎవరూ ఊహించలేమని ఆమె వ్యాఖ్యానించారు.

రెడ్డి సామాజికవవర్గానికి చెందిన తాను కచ్చితంగా వైసీపీలో చేరతానని అంతా అనుకున్నారని... కానీ తాను మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించానని వివరించారు. తాను ప్రజాశాంతి పార్టీలో చేరిన సమయంలోనూ కేఏ పాల్ ఈ విషయంలో తనను అనుమానించారని ఆమె గుర్తు చేసుకున్నారు. మీరు వైసీపీ కోవర్టు కదా అంటూ తనను పలుసార్లు పాల్ ప్రశ్నించారని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు సంతోషించిన వాళ్లలో తాను కూడా ఉన్నానని... కానీ అదంతా ఆ సమయానికి మాత్రమే పరిమితమని శ్వేతారెడ్డి స్పష్టం చేశారు.


First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...