ఈసారి జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని తేల్చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలలో ఓటింగ్‌ను వీవీప్యాట్ స్లిప్పులతో పోల్చి చూడగా... 100 శాతం కచ్చితత్వం కనిపించిందని స్పష్టం చేసింది ఈసీ. ఎన్నికల నిర్వహణ కోసం ఈసారి మొత్తం 22లక్షల 30 వేల బ్యాలెట్ యూనిట్లు, 16లక్షల 30వేల కంట్రోల్ యూనిట్లు, 17లక్షల 30వేల వీవీప్యాట్ యంత్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం EVMల కౌంటింగ్ తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచీ లాటరీ ద్వారా 5 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను, ఈవీఎంలలో ఓటింగ్‌ను దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు సరిపోల్చిచూశారు. ఎక్కడా ఎలాంటి తేడా జరగకపోవడం విశేషం. దీన్ని బట్టీ, కేంద్రంలోని బీజేపీకీ, ఏపీలోని వైసీపీకీ, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు పడినవి ఒరిజినల్ ఓట్లేనని తేలిపోయింది. ఇకపై ఎవరూ EVMలపై ఆరోపణలు చేయడానికి వీల్లేకుండా... లెక్కలతో సహా వివరించింది.
ఏపీలో టీడీపీ ఓటమిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటున్నా... ఆయనతో సహా ఆ పార్టీలోని చాలా మంది నేతలు... వైసీపీకి దక్కిన విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. ఎక్కడో తేడా కొట్టిందనీ, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనీ ఇలాంటి అనుమానాల నుంచీ ఇంకా ఆ నేతలు బయటపడలేకపోతున్నారని సమాచారం. ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ఈవీఎంల పనితీరుపై అదే పనిగా కామెంట్లు చేస్తున్నారు. అంతా సరిగ్గానే ఉన్నప్పుడు అసత్య ఆరోపణలు చెయ్యడం చట్ట రీత్యా నేరం. దీనికి జైలు శిక్షతోపాటూ జరిమానా కూడా ఉంది. ఎన్నికల కోడ్ నిబంధనల్లో ఇది కూడా ఒకటి. ఆ విషయాన్ని మర్చిపోయి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తే వారికే ప్రమాదం అంటున్నారు ఎన్నికల అధికారులు.
అంతా చంద్రబాబు వల్లే : దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అన్ని పార్టీలూ సైలెంట్‌గా ఉంటే, చంద్రబాబు మాత్రం తేనెతుట్టెను కదిపారనీ, ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తూ... దేశవ్యాప్తంగా తిరుగుతూ... బీజేపీయేతర పార్టీలను కలుపుకొని... మొత్తం 22 పార్టీలతో కలియతిరుగుతూ లేనిపోని హడావుడి చేశారనీ... అనవసరంగా టైం వేస్ట్ అవ్వడమే కాక, ప్రజా ధనం వృథా అయ్యిందంటున్నారు అధికారులు. నిజంగా చంద్రబాబు కోరినట్లు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించి ఉంటే, దేశానికి మరింత నష్టం జరిగేదని అంటున్నారు. టెక్నాలజీకి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పుకున్న చంద్రబాబు... ఈవీఎంలపై ఇంత రాద్ధాంతం చెయ్యడం తగదనీ, అందుకే ప్రజలు కూడా ఆయన తీరుతో విసుగెత్తి, అధికారం నుంచీ సాగనంపారని ఎన్నికల అధికారులు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Pics : క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న హిప్పీ బ్యూటీ దిగంగన
మలబార్ అందాల స్వీట్ బ్యూటీ హనీ రోజ్ ఫొటోస్...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Election Commission of India, EVM, Evm tampering, Vvpat