చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చట్టం ముందు అందరు సమానులే. అది సాధారణ వ్యక్తైనా..కేంద్ర మంత్రైనా..! అందుకే కేంద్ర రవాణాశాఖ మంత్రికీ ఫైన్ పడింది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిచినందుకు నితిన్ గడ్కరీ కారుకు చలాన్ విధించడంతో ఆయన జరిమానా కట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ముంబైలో అతి వేగంతో కారు నడిపినందుకు పోలీసులు చలాన్ విధించారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే కొత్త వాహన చట్టాన్ని తీసుకొచ్చామన్నారు గడ్కరీ. మోదీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయం చెప్పారు.
అధిక చలాన్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నాకు కూడా జరిమానా పడింది. ముంబైలోని బంద్ర-వర్లీ సీ లింక్ రోడ్డులో అతి వేగంతో వెళ్లినందుకు నా కారుకు చలానా వేశారు. దీని వలన క్రమశిక్షణ, పారదర్శకత పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఈ చట్టం కింద రోడ్డు కాంట్రాక్టర్లు, వాహనాల తయారీదారులకు కూడా జరిమానాలు విధిస్తున్నాం.
— నితిన్ గడ్కరీ
దేశంవ్యాప్తెంగా సెప్టెంబరు 1 నుంచి నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చచింది. కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు పడుతున్నాయి. వేలకు వేలు ఫైన్లు పడుతుండడంతో కొందరైతే వాహనాలను పోలీసుల దగ్గరే వదిలివేసి వెళ్తున్నారు. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుందని కేంద్రం తీరుపై మండిపడుతున్నారు వాహనదారులు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.