ఓట్లు వేయకపోయినా సహకారం అందిస్తా.. ఏపీకి ప్రధాని మోదీ హామీ

‘జగన్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. ఏపీ అభివృద్ధికి, ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నా.’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.

news18-telugu
Updated: June 9, 2019, 6:15 PM IST
ఓట్లు వేయకపోయినా సహకారం అందిస్తా.. ఏపీకి ప్రధాని మోదీ హామీ
తిరుపతి సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
news18-telugu
Updated: June 9, 2019, 6:15 PM IST
ఓట్లు వేసినా, వేయకపోయినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజాధన్యవాద సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ‘మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది. 130 కోట్ల మందికి సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ రెడ్డికి శుభాకాంక్షలు. జగన్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. ఏపీ అభివృద్ధికి, ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నా.’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల్లో ముందుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు, ఇన్నొవేషన్ నుంచి స్టార్టప్స్ వరకు ఏపీ.. కొత్త మార్గంలో పయనిస్తుందని మోదీ అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే నవభారతం నిర్మాణం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. తిరుపతి సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘మళ్లీ నాకు అధికారం ఇచ్చిన భారతదేశ ప్రజలకు బాలాజీ పాదపద్మాల సాక్షిగా కృతజ్ఞతలు. స్వామికి ప్రణామాలు.’ అని తెలుగులో ప్రసంగం చేశారు. అలాగే, నమో వెంకటేశం నమామి అంటూ పద్యం చదివారు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...