మంత్రి ఈటల యూటర్న్.. క్రెడిట్ అంతా కేసీఆర్‌దే అంటూ ప్రశంసలు

‘నేను గులాబీ సైనికుడిని. మా నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది.’ అని ఈటల రాజేందర్ అన్నారు.

news18-telugu
Updated: August 29, 2019, 10:36 PM IST
మంత్రి ఈటల యూటర్న్.. క్రెడిట్ అంతా కేసీఆర్‌దే అంటూ ప్రశంసలు
ఈటల రాజేందర్
news18-telugu
Updated: August 29, 2019, 10:36 PM IST
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. గులాబీ జెండాలకు తామే ఓనర్లం అని, మంత్రి పదవి ఎవరి బిక్ష వల్లో రాలేదని ప్రకటించిన ఆయన మాట మార్చారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయ‌కుడు కాసిపేట శ్రీ‌నివాస్ చేరిక సంద‌ర్భంగా తాను చేసిన ప్ర‌సంగాన్ని కొన్ని వార్త ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాలోని కొన్ని వ‌ర్గాలు వ‌క్రీక‌రించాయని ఆరోపించారు. ‘నేను గులాబీ సైనికుడిని. మా నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరిన‌నాటి నుంచి.. నేటి వ‌ర‌కు గులాబీసైనికుడినే. మా నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారే.’ అని ఈటల అన్నారు.

‘తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మ‌య్యే నాటికే నేను ప‌ది ల‌క్ష‌ల కోళ్ల‌ ఫారానికి య‌జ‌మానిన‌ని. క‌మ‌లాపుర్ (ప్ర‌స్తుత హుజురాబాద్‌) నియోజ‌క‌వ‌ర్గానికి న‌న్ను పంపించి, ఇక్క‌డ పోటీచేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆర్. ఇదే విష‌యాన్ని కూడా చెప్ప‌ా. మేము గులాబీ సైనికుల‌ం.
రాజ‌కీయాల్లో సంపాదించుకోవ‌డానికి రాలేదు. నేను పార్ట‌ీలో, ఉద్య‌మంలో చేరేనాటికి పారిశ్రామిక‌వేత్త‌న‌ని. ఓ పార్టీనాయ‌కుడు ఇటీవ‌ల‌ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నంపై స్పందించాల‌ని వేదిక‌పై కోర‌డంతో ఆ ప‌త్రిక‌పై నేను చేసిన కామెంట్ల‌పై రంధ్రాన్వేష‌ణ చేస్తున్నారు. ఇది స‌రికాదు.’ అని ఈటల వివరణ ఇచ్చారు.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...