• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • ETELA RAJENDAR STRATEGICAL MOVE TO IRK TRS AND CM KCR ON HIS MLA POST RESIGNATION TELANGANA BJP PRESIDENT BANDI SANJAY REVEALS AK

Etela Rajendar: ఈటల రాజేందర్ సరికొత్త ప్లాన్.. బయటపెట్టిన బండి సంజయ్.. అసలేం జరుగుతోంది ?

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించిన టీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు.

  • Share this:
    మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. అయితే బీజేపీలో చేరడానికి ముందే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? లేక ఆ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటారా ? అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసే అంశంపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని అన్నారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్న ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని బండి సంజయ్ చెప్పడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? లేక బీజేపీలో చేరినా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారా ? అన్న అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

    ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించిన టీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అలా చేస్తే ఆయనకు ఇతర పార్టీలోకి వెళ్లే స్వేచ్ఛ లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ అలా చేయలేదనే చర్చ జరుగుతోంది. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బీజేపీలో చేరితే ఆయన విషయంలో టీఆర్ఎస్ ఏ రకంగా వ్యవహరిస్తుంది ? ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా ? లేక స్పీకర్ ద్వారా ఆయనపై చర్యలు తీసుకుంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు ఈటల కూడా పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: