హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. అధికార టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అధికారులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. తన పాదయాత్రకు అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము మధ్యాహ్న భోజనం కోసం ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు చేసుకుంటుంటే రైస్ మిల్ యజమానులను భయపెట్టి తమ వంట సరుకులను సీజ్ చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని.. పరకాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అప్రజాస్వామిక పనులకు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తనకు నియోజకవర్గ ప్రజల అశీసులు ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. అంతకుముందు ఈటల రాజేందర్ ఉదయం 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి ఈటల తన పాదయాత్రను మొదలు పెట్టారు.
ముందుగా బత్తినివానీపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో రాజేందర్తోపాటు మాజీ ఎంపీ వినోద్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. హుజూరాబాద్ పరిధిలోని 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల మేర పాదయాత్రకు ఈటల రాజేందర్ శ్రీకారం చుట్టారు. 23 రోజులపాటు ఈ పాదయాత్ర సాగనుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.