Home /News /politics /

ETELA RAJENDAR NEW IDEA TO BJP HIGH COMMAND TO FIGHT WITH CM KCR IN TELANGANA NOW MORE FOCUS ON AGITATORS AK

Telangana: కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఈటల బీజేపీకి అలాంటి సలహా ఇచ్చారా ?

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajendar: సీఎం కేసీఆర్ వ్యూహాలకు, ఈటల రాజేందర్ తనదైన వ్యూహాలతో చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

    రాజకీయాల్లో ప్రత్యర్థిని చిత్తు చేయడంలో వ్యూహాలు కీలకమనే విషయం వేరే చెప్పనవసరం లేదు. అలాంటి రాజకీయ వ్యూహాలను సిద్ధం చేయడంతో పాటు వాటిని సరైన సమయంలో ప్రయోగించడం కూడా ఎంతో ముఖ్యం. ఇలాంటి విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిట్ట అనే పేరుంది. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి 2018లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వరకు కేసీఆర్ అంతా వ్యూహాత్మకంగానే రాజకీయాలు నడిపారు. అందుకే సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొవాలని భావించే నేతలంతా.. ఆయన ఎలాంటి వ్యూహాల అమలు చేస్తారనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ కూడా అదే రకంగా ఆలోచిస్తోంది.

    ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యూహాలు, ఆలోచనల గురించి ఎంతగానో అవగాహన ఉన్న మాజీమంత్రి ఈటల రాజేందర్ ఈ విషయంలో ఆ పార్టీ పెద్దలకు కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేత ఒకరితో సమావేశమైన ఈటల రాజేందర్.. ఈ మేరకు బీజేపీ పెద్దలకు ఓ ముఖ్యమైన సలహా ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ మేరకు పలువురు నేతలతో ఆ పార్టీ స్థానిక నేతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని పార్టీలో చేర్చుకోవాలని ఈటల రాజేందర్ బీజేపీ పెద్దలకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాగైనా మళ్లీ తెలంగాణవాదాన్ని, సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తారని.. అప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలో ఉద్యమంలో పని చేసిన వాళ్లు ఉంటే బాగుంటుందని ఆయన పార్టీ పెద్దలకు చెప్పినట్టు టాక్. ఈటల రాజేందర్ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

    Telangana: వరికి బదులు ఈ పంటల వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచన

    Etela Rajendar: ఈటల రాజేందర్ మాస్టర్ ప్లాన్.. అదే జరిగితే బీజేపీలో లెక్కలు మారతాయా ?

    ఇందులో భాగంగా ఉద్యమంలో పని చేసిన ఉద్యోగ సంఘం నేత విఠల్‌ను బీజేపీ పార్టీలో చేర్చుకుందని.. ఈ దిశగా మరికొందరు ఉద్యమ నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతోందని సమాచారం. ఉద్యమకారులతో సన్నిహితంగా ఉండి.. ఉద్యమ సమయంలో వారితో కలిసి పని చేసిన ఈటల రాజేందర్.. అలాంటి వారిని గుర్తించి వారిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ నేతలతో టీఆర్ఎస్, కేసీఆర్‌ను టార్గెట్ చేసే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోందనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్ వ్యూహాలకు, ఈటల రాజేందర్ తనదైన వ్యూహాలతో చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Etela rajender, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు