• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • ETELA RAJENDAR MAY FIELD HIS WIFE JAMUNA IN HUZURABAD BY ELECTIONS A DECISION LIKE CM KCR STYLE AK

Etela Rajendar: ఈటల మాస్టర్ ప్లాన్.. కేసీఆర్ తరహా నిర్ణయం.. ఎవరూ ఊహించని విధంగా..

ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఈటల రాజేందర్ భార్య జమున చేసిన వ్యాఖ్యలు సైతం ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.

  • Share this:
    రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. అయితే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కని విధంగా ఉంటాయి. తన ప్రత్యర్థులు ఊహించని విధంగా, వారి ఊహాలకు అందని విధంగా కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రాజకీయాల్లో సుమారు రెండు దశాబ్దాల పాటు కేసీఆర్‌తో ప్రయాణం సాగించిన మాజీమంత్రి ఈటల రాజేందర్ సైతం సీఎం కేసీఆర్ ఊహించని విధమైన రాజకీయ ఎత్తు వేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల రాజేందర్.. ఈ భేటలో అనేక అంశాలను చర్చించారు.

    అయితే ఈ చర్చలో భాగంగా తన భార్య జమునను రాజకీయాల్లోకి తీసుకొచ్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నుంచి మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆయన హుజూరాబాద్ స్థానం నుంచి తన భార్య జమునను బరిలో దింపాలనే వ్యూహంతో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన తన భార్య జమునను బరిలోకి దించడం ద్వారా ఆ వర్గం ఓట్లతో పాటు బీసీల ఓట్లను కూడా ఆకర్షించే అవకాశం ఉంటుందని ఈటల రాజేందర్ భావిస్తున్నారని.. ఇదే ప్రతిపాదనను బీజేపీ జాతీయ నాయకత్వం ముందు ఉంచారని కొందరు చర్చించుకుంటున్నారు.

    మరోవైపు ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఈటల రాజేందర్ భార్య జమున చేసిన వ్యాఖ్యలు సైతం ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో అనేక సంవత్సరాలు సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రమాణం సాగించిన ఈటల రాజేందర్.. కేసీఆర్ తరహాలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: