ETELA RAJENDAR MAY CHANGE SENIOR LEADER D SRINIVAS DECISION A SHOCK FOR REVANTH REDDY AK
రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..
ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ( ఫైల్ ఫోటో)
టీఆర్ఎస్ రెబల్ ఎంపీ, బీజేపీ ఎంపీ అరవింద్ తండ్రి డీఎస్‌ను ఈటల రాజేందర్ కేవలం మర్యాద పూర్వకంగా కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. ఈ భేటీకి కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కొద్దిగా మారిపోయాయి. అప్పటివరకు అధికార టీఆర్ఎస్‌కు బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పోటీ ఇచ్చింది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. దీనికితోడు రేవంత్ రెడ్డి చాలాకాలం తరువాత కాంగ్రెస్ తరపున సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇది ఆ పార్టీకి ఎంతో కొంత కలిసొచ్చిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవసత్వాలు నింపే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఊహించని బ్రేక్ వేసింది. ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డికి పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అనేక దశాబ్దాలు కావొస్తుండటంతో.. ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేసి సమయం వృధా చేసుకోవద్దని రేవంత్ రెడ్డి భావించారు. అందుకే హుజూరాబాద్‌పై అంతగా దృష్టి పెట్టలేదు.
ఇది కూడా బీజేపీ తరపున పోటీ చేసిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు కలిసొచ్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌పై ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటే.. అక్కడ ఆ పార్టీకి మరిన్ని ఓట్లు వచ్చి ఉండేవనే వాదన ఆ పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. కారణాలు ఏమైనా.. అక్కడ మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేసిన మంచి విజయం సాధించడంతో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే హుజూరాబాద్‌లో విజయం సాధించిన ఈటల రాజేందర్.. నిన్న సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్‌ను కలిశారు.
టీఆర్ఎస్ రెబల్ ఎంపీ, బీజేపీ ఎంపీ అరవింద్ తండ్రి డీఎస్‌ను ఈటల రాజేందర్ కేవలం మర్యాద పూర్వకంగా కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. ఈ భేటీకి కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీఎస్‌ను కలిశారు. ఈ సందర్భంగా డీఎస్‌ను మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని.. కొన్ని నెలల తరువాతా దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో డీఎస్ మళ్లీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదని.. ఆయనను బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ కూడా ఆహ్వానించారని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి.. తద్వారా టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని ఈటల రాజేందర్ ప్రయత్నాలు చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరే విషయంలో డీఎస్ సానుకూల నిర్ణయం తీసుకుని మనసు మార్చుకుంటే.. అందుకు ఈటల రాజేందర్ కూడా ఒక కారణమే అనే చర్చ సాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.