రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న వాళ్లు తమ రాజకీయ భవిష్యత్తుతో పాటు తమను నమ్ముకుని వచ్చిన వారి రాజకీయ భవిష్యత్తును కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలా తమ అనుచరులకు కూడా రాజకీయంగా సరైన న్యాయం చేస్తే.. ఆ నాయకుడి ఇమేజ్ పెరుగుతుంది. టీఆర్ఎస్(TRS) నుంచి బీజేపీలోకి వచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంచి విజయం సాధించిన ఈటల రాజేందర్ (Etela Rajendar).. కమలం పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని చాలామంది భావించారు. టీఆర్ఎస్‌లో ముఖ్యనేతగా ఉన్న ఈటల రాజేందర్ సేవలను వినియోగించుకోవడం ద్వారా బీజేపీ నాయకత్వం కేసీఆర్‌కు చెక్ చెబుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే రోజుల గడుస్తున్న కొద్దీ ఈ విషయంలో బీజేపీ తీరు వేరేలా ఉందనే చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసే విషయంలో ఈటల రాజేందర్ సేవలను బీజేపీ ఆశించిన స్థాయిలో వినియోగించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్‌ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలంగా దెబ్బకొట్టాలని భావించిన ఈటల రాజేందర్.. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌ను టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయనను టీఆర్ఎస్ రెబల్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపారు. కానీ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నిర్ణయానికి సరైన మద్దతు లభించలేదు. దీనికితోడు రవీందర్ సింగ్‌కు బీజేపీ నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందనే టాక్ మొదలైంది. ఇది నిజమే అన్నట్టుగా రవీందర్ సింగ్ మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్‌తో కలిసి టీఆర్ఎస్‌లోకి వచ్చిన కరీంనగర్(Karimnagar) జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ.. బీజేపీ నుంచి వేములవాడ టికెట్ ఆశిస్తున్నారు. తన సొంత గ్రామ వేములవాడ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో.. ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఈ సీటుపై తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఫోకస్ చేస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. కరీంనగర్ లేదా వేములవాడ నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారని.. ఈ రెండు సీట్లలో వేములవాడపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెడుతున్నారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Telangana Politics: రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన ఆ సీనియర్ నేత వ్యవహారం ?
YS Sharmila: ఏపీ రాజకీయాలపై కుండబద్ధలు కొట్టిన వైఎస్ షర్మిల.. ఏమన్నారంటే..
ఒకవేళ ఇదే జరిగితే.. ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలోకి వచ్చిన టీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన తుల ఉమకు నిరాశ తప్పదనే వాదన రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. తనతో పాటు టీఆర్ఎస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు తుల ఉమకు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకోవాలని ఈటల రాజేందర్ భావించారనే టాక్ ఉంది. అయితే బీజేపీలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది సస్పెన్స్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etela rajender, Telangana