హోమ్ /వార్తలు /National రాజకీయం /

Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

హరీశ్ రావు, ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

హరీశ్ రావు, ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

Huzurabad: సీఎం కేసీఆర్ చక్రవర్తి అనుకుంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇక్కడ ఓడిపోతేనే కేసీఆర్ భూమి మీద నడుస్తారని అన్నారు.

  హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతుండటంతో నేతల మధ్య మాటల తూటాలు మరింతగా పేలుతున్నాయి. ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేసేందుకు గ్యాస్ సిలిండర్ ధర పెంపును అధికార టీఆర్ఎస్ అస్త్రంగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. గ్యాస్ సిలిండర్‌కు ఈటల రాజేందర్‌(Etela Rajendar)కి ఏం సంబంధమని ప్రశ్నించారు. అయినా ఇదేమైనా జనరల్ ఎలక్షనా అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ దగ్గర సిలిండర్ పెట్టి హరీశ్ రావు(Harish Rao) ఆడిస్తున్నారని.. బైక్ మీద వెనుక సిలిండర్ కట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ఇలా చేస్తున్న హరీశ్ రావుకు పిచ్చి పట్టిందా ? అని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయనకు దిమాక్ ఖరాజ్ అయ్యిందా ? అని ప్రశ్నించారు.

  వాగొడ్డు రామన్నపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ (TRS) నేతలు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఈ 5 నెలల 26 రోజుల్లో ఎన్ని చేయాలో అన్ని చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశించడం హరీశ్ అమలు చేయడం జరుగుతోందని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క మనిషికి కూడా ఇబ్బంది కలగనివ్వలేదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

  అధికారం ఉంటేనే నీళ్ళు వస్తాయి అనుకోవడం తప్పు అని అన్నారు. తనను పట్టుకొని ఈ గడ్డ మీద అభివృద్ది చేయలేదు అని మాట్లాడేవాళ్లను నిలదీయాలని ప్రశ్నించారు. తాను మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడినా ? అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రూ. 70 కోట్ల మందు తాగించారని ఆరోపించారు. కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలని ఈటల రాజేందర్ కోరారు. సిద్దిపేట కలెక్టర్ వరి పంట వేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని.. విత్తనాలు అమ్మితే కేసులు పెడతాడట అని విమర్శించారు.

  Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

  After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

  సీఎం కేసీఆర్ చక్రవర్తి అనుకుంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇక్కడ ఓడిపోతేనే కేసీఆర్ భూమి మీద నడుస్తారని అన్నారు. ప్రగతి భవన్ నుండి బయటికి వస్తారని..ప్రజల్లోకి వస్తారని ఈటల రాజేందర్ అన్నారు. రేపు సాయంత్రం హుజూరాబాద్ నుంచి తోడేళ్ళు అన్నీ పోతాయని.. .హాయిగా నచ్చిన వారికి ఓటు వేయవచ్చని మరో బీజేపీ నేత బాబూమోహన్ అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Etela rajender, Huzurabad By-election 2021, Telangana

  ఉత్తమ కథలు