• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ETELA RAJENDAR CHANGES HIS POLITICAL STRATEGY TO COUNTER TRS AND CM KCR AK

Etela Rajendar: ఈటల మార్క్ రాజకీయం.. హైదరాబాద్‌కు మారిన సీన్.. కేసీఆర్‌కు ధీటుగా..

Etela Rajendar: ఈటల మార్క్ రాజకీయం.. హైదరాబాద్‌కు మారిన సీన్.. కేసీఆర్‌కు ధీటుగా..

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: తమకు తాముగా ఈటలను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా ఆయనకు సానుభూతి వస్తుందనే భావనలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉందనే చర్చ జరుగుతోంది.

  • Share this:
    తెలంగాణలో ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌లో పర్యటించిన తరువాత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. అయితే హుజూరాబాద్ పర్యటన తరువాత హైదరాబాద్‌లోనూ పలువురితో చర్చించిన తరువాత దీనిపై స్పష్టత ఇస్తానని ప్రకటించారు. దీంతో ఈటల రాజేందర్ ఈ విషయంలో ఏ రకంగా ముందుకు సాగుతున్నారనే అంశం అర్థంకావడం లేదు. నిజానికి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తారని చాలామంది భావించారు.

    కానీ ఆయన మాత్రం ఆ దిశగా ప్రకటన చేయలేదు. టీఆర్ఎస్‌ నాయకత్వంపై విమర్శలు చేసిన ఈటల.. ఎమ్మెల్యే పదవి, టీఆర్ఎస్‌కు రాజీనామా చేసే విషయంలో మాత్రం తొందరపడొద్దని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ నాయకత్వం వచ్చిందని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు కేసీఆర్‌కు లేఖ రాయడం వెనుక ఆంతర్యం కూడా ఇదేననే ప్రచారం జరిగింది. అయితే తమకు తాముగా ఈటలను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా ఆయనకు సానుభూతి వస్తుందనే భావనలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఆయనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వేచి చూడాలని అనుకుంటున్నట్టు సమాచారం.

    మరోవైపు టీఆర్ఎస్‌కు తనకు తాను రాజీనామా చేయకుండా ఆ పార్టీ తనను బహిష్కరించే వరకు వేచి చూడాలనే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా లేక పార్టీ నుంచి ఆయన బహిష్కరించే పరిణామాల్లో ఏది ముందు జరుగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్‌లో తన సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యూహాలు ఏ రకంగా ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ఈటల రాజేందర్‌ వాటికి ధీటుగా వ్యూహరచన చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు