Home /News /politics /

ETELA RAJENDAR AND DK ARJUN MAY PLAY KEY ROLE IN TELANGANA BJP JOINING IN NEAR FUTURE AK

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలే కీలకం కాబోతున్నారా ?.. అవన్నీ వారి ద్వారానే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana BJP: తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటైన పోటీ ఇచ్చే స్థాయికి ఎదగాలంటే... చేరికలు కచ్చితంగా అవసరమని భావిస్తోంది.

    తెలంగాణ బీజేపీ ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత తమకు వచ్చిన జోష్‌ను కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలోకి చేరికలను ప్రొత్సహించి.. ఇతర పార్టీలపై ఒత్తిడి పెంచాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటైన పోటీ ఇచ్చే స్థాయికి ఎదగాలంటే... చేరికలు కచ్చితంగా అవసరమని భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపై పార్టీలో కొద్దిరోజుల క్రితం చర్చ జరిగిందని.. ఇందులో భాగంగా ఇద్దరు నేతలకు తెలంగాణ బీజేపీ నాయకత్వం కీలకమైన బాధ్యతలు అప్పగించిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

    ఇటీవల టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలని భావించే వారిని తీసుకొచ్చే బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఇప్పటికే ఆయన ఈ పని మొదలుపెట్టారని.. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ త్వరలోనే అధికారికంగా బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఇక టీఆర్ఎస్‌లో తనకున్న పరిచయాలను ఉపయోగించుకున్న.. అక్కడ ఉన్న అసంతృప్తి నేతలను కమలం గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలను ఈటల రాజేందర్ మొదలుపెట్టారనే చర్చ సాగుతోంది. అందుకే అధికార పార్టీ సైతం ఈటల రాజేందర్‌తో టచ్‌లో ఉన్న టీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    అయితే టీఆర్ఎస్ నుంచి వచ్చేవాళ్లందరినీ పార్టీలో చేర్చుకోకుండా.. కేవలం బలమైన నేతలు, విశ్వసనీయత ఉన్న నేతలను మాత్రమే కమలం గూటికి తీసుకురావాలని ఈటల ప్లాన్ చేశారని టాక్. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలస వచ్చే నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను డీకే అరుణకు ఆ పార్టీ అప్పగించినట్టు సమాచారం. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు, అందులోనూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతలను డీకే అరుణ తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు ఆమె కొందరు కాంగ్రెస్ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

    Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విలీనం.. ఫలించిన Revanth Reddy ప్లాన్..

    Telangana: ఆ రోజు నుంచే రైతులకు రైతుబంధు నగదు బదిలీ.. మొదట ఇచ్చేది వారికే..

    వీరితోపాటు ఒకరిద్దరు ముఖ్యనేతలు కూడా చేరికల విషయంలో వీరితో సమన్వయం చేసుకునే బాధ్యతలను బీజేపీ నాయకత్వం అప్పగించినట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో నేతల చేరిక విషయంలో ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. లేకపోతే.. ఆ తరువాత పార్టీలో ఇతర సమస్యలు వస్తాయని నేతలు ముందుగానే మాట్లాడుకున్నారని టాక్. మొత్తానికి తెలంగాణ బీజేపీలో చేరికలు విషయంలో ఇకపై ఇద్దరూ నేతలే ఎక్కువ కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: DK Aruna, Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు