Etela Rajender: ఈటల రాజీనామా చేసేది ఆ రోజేనా.. ఆయనతో పాటు మరికొంత మంది నాయకులు..!

ఈటల రాజేందర్ (ఫైల్)

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ నెల 4న తెరాసకు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నెల 8 న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం.

  • Share this:
    మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ నెల 4న తెరాసకు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అంతే కాకుండా రాజీనామా చేసిన తర్వాత రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని ఈ నెల 8 లేదా 9 న బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం జేపీ నడ్డాను, మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ని, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసిన ఆయన బుధవారం మరోమారు జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ క్ర‌మంలోనే ఏనుగు రవీందర్‌రెడ్డిలు ఛుగ్‌, మాజీ ఎంపీ జి.వివేక్‌వెంకటస్వామితో కలిసి ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌తో సాయంత్రం భేటీ అయ్యారు. ఈటెల నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించేందుకు ఈటల ఈ నెల 4న విలేకరుల సమావేశం పెడుతున్నారు.

    ముందు ఎమ్మెల్యే పదవికి, తెరాసకు రాజీనామా చేసి.. మంచిరోజు చూసుకుని దిల్లీకి వచ్చి భాజపాలో చేరతానని రాజేందర్‌ అన్నట్లు సమాచారం. ఈటల సహా మొత్తం అయిదుగురు నేతలు భాజపాలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాజేందర్‌, రవీందర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

    ఈటెల బీజేపీలో చేరికపై బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారనేది అవాస్తవమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరితే పార్టీ పుంజుకుంటుందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్ తెలంగాణ కోసం పోరాడిన నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తని ఆయ‌న కొనియాడారు
    Published by:Veera Babu
    First published: