గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్.. ‘ఆలిండియా టాపర్’

గవర్నర్‌ను మార్చేస్తారంటూ ఇప్పటి వరకు చాలాసార్లు వార్తలు వచ్చాయి. 2009 నుంచి వస్తూనే ఉన్నాయి. రిటైర్డ్ జస్టిస్ సదాశివం, కిరణ్ బేడీ, ఆనంది బెన్ పటేల్ లాంటి వారి పేర్లు వినిపించాయి.

news18-telugu
Updated: April 24, 2019, 12:11 PM IST
గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్.. ‘ఆలిండియా టాపర్’
గవర్నర్ నరసింహన్(File)
news18-telugu
Updated: April 24, 2019, 12:11 PM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొత్త రికార్డు బద్దలు కొట్టారు. దేశంలో అందరికంటే ఎక్కువకాలం గవర్నర్‌గా పనిచేసిన రికార్డును నెలకొల్పారు. ఆ రకంగా ఆలిండియా టాపర్‌గా నిలిచారు. 2007వ సంవత్సరం నుంచి 2019 వరకు అంటే, పుష్కరకాలం పాటు గవర్నర్‌గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2009 డిసెంబర్ 27న తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాకముందు ఆయన తొలిసారిగా ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా సేవలు అందించారు. 2007 జనవరి 25 నుంచి 2009 డిసెంబర్ 27 వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులు అయ్యే వరకు ఆయన ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా పనిచేశారు. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు ఆయనే గవర్నర్‌గా కొనసాగుతున్నారు.

అత్యధికకాలం గవర్నర్‌గా పనిచేసిన వారు
ఈఎస్ఎల్ నరసింహన్ (12 సంవత్సరాలు 4 నెలలు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)

సుర్జీత్ సింగ్ బర్నాలా (11 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్)




ఎక్కువకాలం గవర్నర్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన ఘనతతో పాటు మరో కేటగిరీలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. గతంలో స్వాతంత్ర్య ఉద్యమకారిణి సరోజినీ నాయుడు కుమార్తె పద్మజానాయుడు 1956 నవంబరు 3 నుంచి 1967 జూన్‌ 1 వరకు (10 సంవత్సరాల 209 రోజులు) ఒకేచోట పనిచేశారు. నరసింహన్ రెండో స్థానంలో (9 ఏళ్ల నాలుగు నెలలు) ఉన్నారు.

యూపీఏ హయాంలో నియామకమై ఎన్డీయేలో కూడా పూర్తికాలం కొనసాగిన ఒకే ఒక్క గవర్నర్‌గా కూడా నరసింహన్ రికార్డు నెలకొల్పారు. యూపీఏ కాలంలో నియమితులైన గవర్నర్లు అందరూ స్థానభ్రంశం చెందారు. కానీ, నరసింహన్ ఒక్కరే ఎన్డీయే హయాంలో కూడా ఐదేళ్లపాటు కంటిన్యూ కాగలిగారు. గవర్నర్‌ను మార్చేస్తారంటూ ఇప్పటి వరకు చాలాసార్లు వార్తలు వచ్చాయి. 2009 నుంచి వస్తూనే ఉన్నాయి. రిటైర్డ్ జస్టిస్ సదాశివం, కిరణ్ బేడీ, ఆనంది బెన్ పటేల్ లాంటి వారి పేర్లు వినిపించాయి. కానీ, నరసింహన్ మాత్రం తన ట్రాక్ రికార్డుకు ఎలాంటి ఢోకా లేకుండా కంటిన్యూ అవుతున్నారు.
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...