Erra Shekhar: బండి సంజయ్ పర్యటన.. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా

ఎర్ర శేఖర్

తెలంగాణలో బీజేపీకి పాలమూరులో  షాక్ తగిలింది. మహబూబ్‌ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

  • Share this:
    తెలంగాణ బీజేపీకి పాలమూరులో  షాక్ తగిలింది. మహబూబ్‌ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఆయన పేరిట ఒక నోట్ విడుదలైంది. అనివార్య కారణాల వల్ల తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు శేఖర్ అందులో పేర్కొన్నారు. ఇక, తాను రాజీనామా చేసిన విషయాన్ని ఎర్ర శేఖర్ ధ్రువీకరించారు. త్వరలోనే రాజీనామాకు సంబంధించి వివరాలను వెల్లడిస్తానని శేఖర్ మీడియాకు చెప్పారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు ఉమ్మడి జిల్లాల పర్యటనలో ఉండగానే ఎర్ర శేఖర్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే శేఖర్‌ రాజీనామా వెనక గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక, రాజకీనామాకు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందుకు ఎర్ర శేఖర్ హాజరైనట్టుగా సమాచారం. ఆ తర్వాతే ఆయన తన రాజీనామాను ప్రకటించారు.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల మంచి ఫలితాలు రాబట్టిన బీజేపీ మంచి జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. రాష్ట్రంలోని పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

    ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎర్ర శేఖర్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో అదే స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. గతేడాది ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరారు.
    Published by:Sumanth Kanukula
    First published: