పాకిస్తాన్‌కు షాక్.. పీవోకేపై బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై పూర్తి హక్కులు ఇండియాకే ఉన్నాయని, వెంటనే ఆ ప్రాంతాన్ని ఆ దేశానికి అప్పజెప్పాలని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే‌ను విడిచిపెడితే పాక్‌కే మేలు అని ఆయన వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 16, 2019, 11:39 AM IST
పాకిస్తాన్‌కు షాక్.. పీవోకేపై బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
బాబ్ బ్లాక్‌మ్యాన్
news18-telugu
Updated: September 16, 2019, 11:39 AM IST
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై పూర్తి హక్కులు ఇండియాకే ఉన్నాయని, వెంటనే ఆ ప్రాంతాన్ని ఆ దేశానికి అప్పజెప్పాలని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే‌ను విడిచిపెడితే పాక్‌కే మేలు అని ఆయన వ్యాఖ్యానించారు. యూకేలోని కాశ్మీరీ పండిట్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆర్టికల్ 370 రద్దుపై ఐక్యరాజ్యసమితికి వెళ్లాలన్న పాకిస్తాన్‌ ప్రతిపాదనను తప్పుపట్టారు. ‘జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత్ హక్కు. ఆ రాష్ట్రాన్ని ఒకటి చేసేందుకు వెంటనే పీవోకేను పాక్ మిలటరీ దళాలు ఖాళీ చేయాలి’ అని సూచించారు. కాగా, ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నప్పటి నుంచి బ్యాక్‌మ్యాన్ భారత్‌కే తన మద్దతు తెలుపుతున్నారు. ఆ సమయంలో.. నరేంద్ర మోదీ మరోసారి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని కొనియాడారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఆయన ప్రధాని మోదీకి వీరాభిమాని.

ఇదిలా ఉండగా, సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి భారత ఆర్మీ దళాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే, వాటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...