Home /News /politics /

ENTIRE KUMARASWAMY CABINET RESIGNS TO MAKE WAY FOR REBEL MLAS AS CONGRESS JDS GOVT TEETERS ON THE BRINK MS

32 మంది మంత్రుల మూకుమ్మడి రాజీనామా.. గవర్నర్‌ను కలవనున్న కుమారస్వామి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం సాయంత్రం గవర్నర్ వాజుభాయ్ పటేల్‌ను సీఎం కుమారస్వామి కలవనున్నారు. 32 మంది మంత్రుల రాజీనామా పత్రాలను ఆయన గవర్నర్‌కు సమర్పించనున్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్నవారందరితో కుమారస్వామి రాజీనామా చేయించారు.

ఇంకా చదవండి ...
    కర్ణాటక రాజకీయం ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్,జేడీఎస్‌లను వీడటంతో సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య మాత్రం తమ ప్రభుత్వమే కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు సీఎం కుమారస్వామి కూడా రాష్ట్రంలో తమ ప్రభుత్వమే కొనసాగుతుందన్న ధీమాతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తాను ఆలోచించడం లేదని.. పాలన పైనే దృష్టి పెట్టానని చెప్పారు.బెంగళూరు నుంచి ముంబైకి విమానాలు ఉన్నట్టే.. ముంబై నుంచి బెంగళూరుకి కూడా విమానాలు ఉంటాయని కుమారస్వామి ఛమత్కరించారు. అంటే, బీజేపీ క్యాంపులో చేరడానికి ముంబై వెళ్లిన
    ఎమ్మెల్యేలు తిరిగొచ్చి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని పరోక్షంగా చెప్పారు.

    సోమవారం సాయంత్రం గవర్నర్ వాజుభాయ్ పటేల్‌ను సీఎం కుమారస్వామి కలవనున్నారు. 32 మంది మంత్రుల రాజీనామా పత్రాలను ఆయన గవర్నర్‌కు సమర్పించనున్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్నవారందరితో కుమారస్వామి రాజీనామా చేయించారు. గవర్నర్‌కు రాజీనామా పత్రాలు సమర్పించి కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు.అయితే ముంబై వెళ్లిన అసంతృప్త ఎమ్మెల్యేలంతా తిరిగొచ్చి సంకీర్ణ ప్రభుత్వంతో కొనసాగుతారా..? లేక బీజేపీ క్యాంపులో చేరిపోతారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వారంతా బీజేపీ వైపు మొగ్గుచూపితే సంకీర్ణ ప్రభుత్వానికి ఎండ్ కార్డ్ పడినట్టే. బీజేపీ కుట్రలతోనే సంకీర్ణ ప్రభుత్వం కుదేలయ్యే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ మాత్రం రాహుల్ గాంధీతోనే ఆ పార్టీలో రాజీనామాల పరంపర మొదలైందని.. ఆయన్ను చూసి మిగతావాళ్లు కూడా అదే బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Congress, Hd devegowda, Hd kumaraswamy, Jds, Karnataka, Karnataka political crisis

    తదుపరి వార్తలు