ఎన్‌కౌంటర్లతో సమస్యలు పరిష్కారం కావు : కోదండరాం

వరంగల్‌లో అత్యాచారం,హత్యకు గురైన యువతి ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

news18-telugu
Updated: December 7, 2019, 5:31 PM IST
ఎన్‌కౌంటర్లతో సమస్యలు పరిష్కారం కావు : కోదండరాం
కోదండ‌రాం ( ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
దిశా హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ల తర్వాత మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామికవాదులు ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్న సంగతి తెలిసిందే. శిక్షలు విధించే అధికారం ఖాకీ చేతికి ఇవ్వవద్దని.. న్యాయ విచారణ తర్వాతే శిక్షలు అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భావోద్వేగాల ప్రాతిపదికగా శిక్షలు అమలుచేయవద్దంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కూడా ఇదే అభిప్రాయాన్ని వినిపించారు. మహిళలపై అత్యాచారాలకు,అఘాయిత్యాలకు ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దిశా తరహా ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీజేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాంమాట్లాడారు.

వరంగల్‌లో అత్యాచారం,హత్యకు గురైన యువతి ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అత్యాచారాలు,హత్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.ఇదిలా ఉంటే,దిశ హత్యాచార ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కమిషన్ సభ్యులు ఆదివారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని..అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించిన అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్ పల్లి ప్రాంతానికి వెళ్లనున్నారు.


First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>