హుజూర్‌నగర్‌లో 100 మంది నామినేషన్ ? సీపీఎస్ రద్దుకు డిమాండ్...

Telangana News : ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు దిశగా అడుగులు వేస్తుండటంతో... తెలంగాణలో కూడా రద్దు చేయించేందుకు వ్యూహాలు అమలు చెయ్యబోతున్నారా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 6:05 AM IST
హుజూర్‌నగర్‌లో 100 మంది నామినేషన్ ? సీపీఎస్ రద్దుకు డిమాండ్...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 6:05 AM IST
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సీపీఎస్‌ విధానంపై.. కేబినేట్‌ కమిటీ వేసి చర్చించాలని చూస్తుంటే ఆ ప్రభావం పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణపైనా పడుతోంది. తెలంగాణలో కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్‌)ని రద్దు చేయించేందుకు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికలు జరిగినప్పుడు 178 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు... నిజామాబాద్ స్థానానికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇప్పుడు అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలోనూ పోటీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నట్లు సమాచారం.

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం తేవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. అందుకోసం తమ కుటుంబ సభ్యులను హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక బరిలోకి దింపాలనుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి గెలుపొందిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దాంతో హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. దాదాపు 100 నామినేషన్లు వేయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.


ప్రస్తుతం హుజూర్ నగర్ స్థానం నుంచీ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఆయనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే... ఉత్తమ్ కుమార్ తన భార్య... కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిను బరిలో దింపాలనుకుంటున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్... కవితను ఈ అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే... మరో ఇందూరులా కనిపించడం ఖాయం. ఐతే... కోదండరామ్‌కి లెఫ్ట్ పార్టీలతోపాటూ... ఉద్యమ సంఘాలు మద్దతుగా నిలిచే అవకాశాలు ఎక్కువ. కవిత గనక బరిలో దిగితే... ఆమెకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...