Emergency Anniversary: ఐదేళ్లుగా ‘సూపర్ ఎమర్జెన్సీ’...ప్రధాని మోదీని టార్గెట్ చేసిన మమత

Emergency Anniversary | గత ఐదేళ్లుగా దేశంలో ‘సూపర్ ఎమర్జెన్సీ’ కొనసాగుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు.

news18-telugu
Updated: June 25, 2019, 12:11 PM IST
Emergency Anniversary: ఐదేళ్లుగా ‘సూపర్ ఎమర్జెన్సీ’...ప్రధాని మోదీని టార్గెట్ చేసిన మమత
ప్రధాని మోదీ, మమత బెనర్జీ(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశంలో ఎమర్జెన్సీ పాలన అమలుచేసి మంగళవారంనాటితో 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొంటున్నాయని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ పాలన ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులను మించిపోయాయని ఆమె ఎద్దేవా చేశారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసం అందరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.





1975 జూన్ 25 తేదీన నాటి ప్రధాని ఇంధిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించగా...ఇది 1977 మార్చి 21 వరకు కొనసాగింది.
First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు