ప్రధానిగా తమ పార్టీ మద్దతు రాహుల్ గాంధీకే ఉంటుందని ఇప్పటికే పలు సందర్భాల్లో స్టాలిన్ స్పష్టం చేశారు. అంతేకాదు డీఎంకే పార్టీ యూపీఏలో భాగస్వామ్యపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని డీఎంకే నేతలు తేల్చిచెబుతున్నారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు కేసీఆర్. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వమే ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్న కేసీఆర్..అందుకోసం ప్రాంతీయ పార్టీలను కలిసి మద్దతు కడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తమతో కలిసి రావాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరినట్లు ప్రచారం జరిగింది. ఐతే తెలంగాణ సీఎం పర్యటన ముగిసిన మరుసటి రోజే ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో తృతీయ కూటమికి అవకాశాలు లేవని స్టాలిన్ మంగళవారం స్పష్టంచేశారు. కేసీఆర్‌తో జరిగిన భేటీలో అసలు ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలే జరగలేదని బాంబుపేల్చారు. తమిళనాడులో ఆలయాల సందర్శన కోసమే కేసీఆర్ వచ్చారని... అనంతరం మర్యాదపూర్వకంగానే తనను కలిశారని వెల్లడించారు. ఈ భేటీ వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు స్టాలిన్.
దేశంలో మూడో కూటమికి అవకాశంలేనట్లు నాకు అనిపిస్తోంది. మే 23న కౌంటింగ్ తర్వాతే దానిపై క్లారిటీ వస్తుంది. కేసీఆర్ కూటమి గురించి మాట్లాడేందుకు రాలేదు. ఆలయాలను సందర్శించేందుకు మాత్రమే తమిళనాడుకు వచ్చారు. దైవ దర్శనం పూర్తయ్యాక మర్యాదపూర్వకంగానే నన్ను కలిశారు. సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరగలేదు.
— స్టాలిన్, డీఎంకే అధినేత
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. అంతేకాదు ఒకవేళ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే.. వైఎస్ జగన్ సపోర్ట్ కూడా ఉంటుందని టీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఐతే కేసీఆర్ కలిసిన నేతల్లో ఏ ఒక్కరి నుంచీ స్పష్టమైన హామీ లభించనట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రధానిగా తమ పార్టీ మద్దతు రాహుల్ గాంధీకే ఉంటుందని ఇప్పటికే పలు సందర్భాల్లో స్టాలిన్ స్పష్టం చేశారు. అంతేకాదు డీఎంకే పార్టీ యూపీఏలో భాగస్వామ్యపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని డీఎంకే నేతలు తేల్చిచెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకుండా ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోవని స్పష్టంచేస్తున్నారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ క్రమంలో మే23న ఫలితాల తర్వాత కేసీఆర్ ఎలా ముందుకెళ్తారని ఆసక్తిగా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.