కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమేథీలో నమాజ్ చేస్తూ...ఉజ్జయినిలో మహంకాళి ఆలయంలో పూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ఇలా చేస్తున్నారంటూ నేరుగా ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించకుండా సెటైర్లు విసిరారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు...ప్రియాంక గాంధీ సోమవారం ఉజ్జయినిలో మహంకాళి ఆలయాన్ని దర్శించుకోవడంపై స్పందిస్తూ స్మృతి ఈ కామెంట్స్ చేశారు.
స్మృతి ఇరానీ అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తలపడుతున్నారు. రాహుల్ గాంధీ విజయం కోసం ప్రియాంక గాంధీ అమేథీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసిన స్మృతి ఇరానీ, దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.