వచ్చే ఎన్నికల్లో మద్దతు ఎవరికి?...క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్

Salman Khan on Political Entry | కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బరిలో నిలవనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశం, వచ్చే ఎన్నికల్లో తన మద్దతు ఎవరికన్న అంశంపై సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: March 21, 2019, 5:28 PM IST
వచ్చే ఎన్నికల్లో మద్దతు ఎవరికి?...క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్(ట్విట్టర్ ఫోటో)
  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్నది ఆ పుకార్ల సారాంశం. ఇండోర్ సల్మాన్ ఖాన్ స్వస్థలం కావడం విశేషం. 1989 నుంచి ఇక్కడ బీజేపీనే గెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి  సల్మాన్ ఖాన్‌‌ను బరిలోకి దించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. బాలీవుడ్ హీరోతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై  పీటీఐతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది కూడా ధృవీకరించారు. సల్మాన్ ఖాన్‌తో కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని, ఇండోర్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పారు.

ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే యోచన తనకు లేదని స్పష్టంచేశారు. ఏ రాజకీయ పార్టీ కోసమూ ప్రచారం చేసే యోచన కూడా తనకు లేదని తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీ కోసం ఇండోర్‌లో ప్రచారం నిర్వహించనున్నట్లు కథనాలను తోసిపుచ్చుతూ ట్వీట్ చేశారు.





అటు సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా చొరవ చూపాలంటూ సల్మాన్ ఖాన్ పలువు సెలబ్రిటీలను ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా గత వారం విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్...ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మనందరి హక్కుగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు