దేశవ్యాప్తంగా రూ.509 కోట్లు పట్టివేత... టాప్‌లో ఏపీ, తమిళనాడు

దేశవ్యాప్తంగా రూ.509 కోట్లు పట్టివేత... టాప్‌లో ఏపీ, తమిళనాడు

21 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో రూ.60వేల కోట్లు ఖర్చు అయింది.

జాబితాలో రూ.513.44 కోట్ల నగదుతో హరియాణాలో తొలిస్థానంలో నిలిచినట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రూ.401.46 కోట్లతో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

  • Share this:
    సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ప్రలోభాల పర్వం పెరిగింది. దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం ఏరులై పారుతోంది. దీంతో దాడులు చేసిన ఎన్నికల అధికారులు, పోలీసులు దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.509 కోట్లు పట్టుకున్నామన్న ఈసీ ప్రకటించింది. అయితే మొదటి స్థానంలో హరియాణా, రెండో స్థానంలో తమిళనాడు ఉండగా.. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ తనిఖీల్లో భాగంగా రూ.414 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. జాబితాలో రూ.513.44 కోట్ల నగదుతో హరియాణాలో తొలిస్థానంలో నిలిచినట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రూ.401.46 కోట్లతో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇక పట్టుబడ్డ నగదు విషయంలో రూ.190.3 కోట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.

    దీంతో పాటు దేశవ్యాప్తంగా 719 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.182 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా రూ.719 కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నామని పేర్కొంది. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈసీ అధికారులు ఈ వివరాలను ప్రకటించారు.

    ఎవరైనా రూ. 50 వేలకు మించి నగదు తీసుకు వెళుతుంటే, ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను తమతో పాటు తీసుకువెళుతుండాలని చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుంటే, ఆ డబ్బును ఐటీ శాఖకు అప్పగించక తప్పదని ఈసీ హెచ్చరించింది. ఆభరణాలు తీసుకెళుతున్నా, వాటికి సంబంధించిన రశీదులు తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెబుతున్నారు. కొద్ది రోజుల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న ఏపీలో అక్రమంగా తరలిస్తున్న నగదుతో పాటు... కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే కోట్లలో విలువైన వస్తువులను కూడా పట్టుకున్నారు.
    First published: