దేశవ్యాప్తంగా భారీగా నగదు పట్టివేత... టాప్‌లో ఏపీ, తమిళనాడు

ఈసీ సీజ్ చేసిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధికమని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో దేశవ్యాప్తంగా జోరుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

news18-telugu
Updated: April 4, 2019, 11:02 AM IST
దేశవ్యాప్తంగా భారీగా నగదు పట్టివేత... టాప్‌లో ఏపీ, తమిళనాడు
తనిఖీల్లో దొరికిన నగదు
news18-telugu
Updated: April 4, 2019, 11:02 AM IST
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ప్రలోభాల పర్వం పెరిగింది. దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం ఏరులై పారుతోంది. దీంతో దాడులు చేసిన ఎన్నికల అధికారులు, పోలీసులు దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు రూ. 377.51 కోట్ల డబ్బును అధికారులు సీజ్ చేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో పాటు రూ. 157 కోట్ల విలువైన మద్యం, రూ. 705 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ. 312 కోట్ల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నామన్నారు అధికారులు. అయితే అధికారులు సీజ్ చేసిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధికమని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో దేశవ్యాప్తంగా జోరుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

ఎవరైనా రూ. 50 వేలకు మించి నగదు తీసుకు వెళుతుంటే, ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను తమతో పాటు తీసుకువెళుతుండాలని  చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుంటే, ఆ డబ్బును ఐటీ శాఖకు అప్పగించక తప్పదని ఈసీ హెచ్చరించింది. ఆభరణాలు తీసుకెళుతున్నా, వాటికి సంబంధించిన రశీదులు తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెబుతున్నారు. కొద్ది రోజుల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న ఏపీలో అక్రమంగా తరలిస్తున్న నగదుతో పాటు... కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే కోట్లలో విలువైన వస్తువులను కూడా పట్టుకున్నారు.

ఇవికూడా చదవండి: 

పోలింగ్ సమయం గంట పెంచిన ఈసీ... సాయంత్రం 6 గంటలవరకు ఓటింగ్



హైదరాబాద్ నుంచి ఏపీకి డమ్మీ ఈవీఎంలు... ఆపార్టీకి చెందినవేనా ?
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...