'మెకానిక్ రాహుల్'...హెలికాప్టర్‌ను రిపేర్ చేసిన కాంగ్రెస్ చీఫ్

దరం కలిసికట్టుగా పనిచేసి మరమ్మతు చేశామని..ప్రమాదమేమీ లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

news18-telugu
Updated: May 10, 2019, 9:17 PM IST
'మెకానిక్ రాహుల్'...హెలికాప్టర్‌ను రిపేర్ చేసిన కాంగ్రెస్ చీఫ్
హెలికాప్టర్ రిపేర్ చేస్తున్న రాహుల్
  • Share this:
రాహుల్ గాంధీ సోనియా కుమారుడిగా, రాజకీయ నేతగానే ఈ ప్రపంచానికి తెలుసు..! కానీ ఆయనలోని మరో కోణాన్ని ఇవాళ బయటపెట్టారు. మెకానిక్ అవతారమెత్తిన రాహుల్ గాంధీ..హెలికాప్టర్‌ను రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చాపర్ కిందకు చేరి నేలపై పడుకొని మరమ్మతు చేశారు రాహుల్. అలాగని ఆయన హెలికాప్టర్‌ను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసే నిపుణుడని అనుకోవద్దు. ఏదో చిన్న సమస్య వస్తే తాతూ ఓ చెయ్యి వేసి దాన్ని సరిచేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో శుక్రవారం రాహుల్ గాంధీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వెళ్లాల్సిన తరుణంలో.. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు సాంకేతిక సమస్య వచ్చింది. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, హెలికాప్టర్ సిబ్బంది దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సైతం ఓ చెయ్యివేసి వారికి సహకరించారు. నేలపై పడుకొని హెలికాప్టర్ డోర్స్ స్క్రూలు బిగించారు. ఇలా అందరం కలిసికట్టుగా పనిచేసి మరమ్మతు చేశామని.. ప్రమాదమేమీ లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు.First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>