గతం కంటే భారీ మెజార్టీ వస్తుంది...గెలుపుపై మోదీ, షా ధీమా

news18-telugu
Updated: May 17, 2019, 5:17 PM IST
గతం కంటే భారీ మెజార్టీ వస్తుంది...గెలుపుపై మోదీ, షా ధీమా
news18-telugu
Updated: May 17, 2019, 5:17 PM IST
లోక్‌సభ ఎన్నికల తుదివిడత ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. బీజేపీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని..ఈసారి కూడా మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తంచేశారు అమిత్ షా. గతం కంటే భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రాబోతోందని స్పష్టంచేశారు.

మా ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బీజేపీ చరిత్రలో విస్తృతంగా ప్రచారంచేసిన ఎన్నికలు ఇవి. 2014లో ప్రజల చారిత్రక తీర్పుతో అధికారంలోకి వచ్చాం. బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. గత ఎన్నికల్లో తాము గెలవని 120 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సారి గతం కంటే ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తాం.
అమిత్ షా


పేదలు, రైతులు, మహిళ సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టిపెట్టినట్లు అమిత్ షా తెలిపారు. దేశ ప్రజల కోసం ప్రభుత్వం 133 పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు. మోదీ పాలనలో ప్రజలంతా సురక్షితంగా జీవిస్తున్నారని చెప్పారు. కూటములతో సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు అమిత్ షా.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...