9న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక: ఎవరు ఏ గట్టునో?

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న టీఆర్ఎస్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతా దళ్, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన తదితర పార్టీలు ఇప్పుడు ఎటువైపు నిలవనున్నాయో రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. 

Janardhan V | news18-telugu
Updated: August 6, 2018, 1:13 PM IST
9న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక: ఎవరు ఏ గట్టునో?
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎటు వైపు? మోదీతో కలిసి నడిచేది ఎవరు? కాంగ్రెస్‌తో చేతులు కలిపే పార్టీలు ఏవి? ఎన్డీయే, యూపీఏలకు సమదూరం పాటించేది ఎవరు?  ఈ ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో స్పష్టమైన సమాధానం లభించే అవకాశముంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను గురువారం(ఈ నెల 9న) నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో...ఈ జూలై మొదటి నుంచే ఈ పదవి ఖాళీగా ఉంది.

ఈ ఎన్నికల్లో అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ తథ్యంగా తెలుస్తోంది. బీజేపీయేత పార్టీల మద్దతు కూడగట్టుకుని ఎన్డీయే అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ మద్దతుతో విపక్షాల తరఫున ఐక్య అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తున్నాయి. రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజార్టీ ఆ పార్టీకి లేదు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అండగా నిలిచినా...తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీజేపీకి మరికొందరు సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. దీంతో బీజేపీ ప్రతిపాదించే అభ్యర్థికి ఎన్డీయేతర పార్టీలు ఏవేవి మద్దతు ఇవ్వనున్నాయో ఆసక్తి రేకెత్తిస్తోంది.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న టీఆర్ఎస్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన తదితర పార్టీలు ఇప్పుడు ఎటువైపు నిలవనున్నాయో రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం కానప్పటికీ అన్నాడీఎంకే బీజేపీ అభ్యర్థినే బలపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోక్‌సభలో 37 మంది సభ్యులతో కూడిన అన్నాడీఎంకే.. మొన్నటి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో మోదీ సర్కార్‌కు బాసటగా నిలిచింది. అన్నాడీఎంకేకి రాజ్యసభలో 13 మంది సభ్యుల బలం ఉంది.


కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే విపక్షాల తరఫు అభ్యర్థికే టీడీపీ మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వబోమని వైసీపీ ఇప్పటికే ప్రకటించగా...ఈ ఎన్నికల్లో విపక్షాల తరఫు అభ్యర్థికి మద్దతిస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే.

బీజేడీ అభ్యర్థినే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి విపక్షాల తరఫున బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచించినా...ఆ పార్టీ అందుకు విముఖత చూపుతోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆ పార్టీ సమదూరం పాటిస్తోంది.
Published by: Janardhan V
First published: August 6, 2018, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading