ఏపీలో జగన్... తమిళనాడులో ఆ క్రేజీ హీరో... పీకే నయా ప్లాన్ ?

తమిళనాడులో పొలిటికల్‌గా రజినీకాంత్ కంటే హీరో విజయ్‌కే ఎక్కువ మొగ్గు ఉందని పీకే సర్వేలో తేలిందని... ఇదే విషయాన్ని ఆ స్టార్ హీరోకు ఆయన స్వయంగా కలిసి వివరించాడనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: November 12, 2019, 11:55 AM IST
ఏపీలో జగన్... తమిళనాడులో ఆ క్రేజీ హీరో... పీకే నయా ప్లాన్ ?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిశోర్
  • Share this:
రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల ముందు నాటి ప్రతిపక్ష వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ కిశోర్... వైసీపీ భారీ మెజార్టీతో గెలవడంలో కీలక భూమిక పోషించారు. ఆ పార్టీ ఎన్నికల హామీలైన నవరత్నాలతో పాటు అభ్యర్థుల ఎంపిక వరకు ప్రశాంత్ కిశోర్ కీలక భూమిక పోషించారు. తాజాగా ఆయన తమిళనాడులో కోలీవుడ్ హీరో కమలహాసన్‌ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యహరిస్తున్నారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

తమిళనాడులో 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్‌ కిషోర్‌కు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. పార్టీ విధానం విషయంలో ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాలను కమలహాసన్‌ విభేదించడమే అందుకు కారణం అని తెలిసింది. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌తో మక్కల్ నీది మయ్యం ఒప్పందం రద్దు కానున్నట్లు సమాచారం. కాగా త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్న రజనీకాంత్‌ కూడా తనకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకోవాలను భావిస్తున్నట్లు, వీరిద్దరి మధ్య ముంబాయిలో భేటీ కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది.

మరోవైపు తమిళనాడులో పొలిటికల్‌గా రజినీకాంత్ కంటే హీరో విజయ్‌కే ఎక్కువ మొగ్గు ఉందని పీకే సర్వేలో తేలిందని... ఇదే విషయాన్ని ఆ స్టార్ హీరోకు ఆయన స్వయంగా కలిసి వివరించాడనే టాక్ వినిపిస్తోంది. మీరు రాజకీయాల్లోకి వస్తే... మీ గెలుపు బాధ్యత తీసుకుంటానని విజయ్‌కు పీకే హామీ ఇచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి ఏపీలో వైఎస్ జగన్ సీఎం కావడంలో కీలక పాత్ర పోషించిన పీకే... తమిళనాడులో మరో పొలిటికల్ స్టార్‌ను తయారు చేస్తాడమో చూడాలి.
First published: November 12, 2019, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading