Lok Sabha Election Result 2019: ఓటమిని అంగీకరించిన రాహుల్ గాంధీ

మీడియాతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

Election Results 2019: అమేథీలో ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.

  • Share this:
    అమేథీలో ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.  అమేథీలో స్మృతి ఇరానీ దాదాపు 30 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ముగియకముందే ఓటమిని అంగీకరిస్తూ స్మృతి ఇరానీకి అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ.  స్మృతి ఇరానీ గెలిచిందని.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు. అమేథి ఓటర్ల నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానన్నారు.  అటు  సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు.  ప్రజలే రాజులను తను ఎన్నికల ప్రచారంలో చెప్పానన్న రాహుల్ గాంధీ...నేడు వాళ్లు తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారని..ప్రధాని మోదీ, బీజేపీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు.

    బీజేపీ, కాంగ్రెస్ కు వేరు వేరు సిద్ధంతాలు ఉన్నాయన్నారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీ విజయం సాధించారని.. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.  ప్రజలు నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారని... ఆ నిర్ణయాన్ని దేశ పౌరుడిగా తాను గౌరవిస్తున్నా అన్నారు. తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, ఓడిన అభ్యర్థులు భయపడవద్దని సూచించారు.

     
    First published: