మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగానలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 150 స్థానాల్లో, శివసేన 124 స్థానాల్లో పోటీ చేశాయి. మిగతా స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీ చేశాయి. మెజార్టీ మార్కు 145. ప్రస్తుతం బీజేపీ, శివసేన కూటమికి అసెంబ్లీలో 217 స్థానాలున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కలిపి 56 సీట్లున్నాయి.మొత్తం 11 ఎగ్జిట్ పోల్స్... బీజేపీ, శివసేన కూటమికి 211 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీకి 64 వస్తాయని అంచనా వేశాయి. గతంలో కంటే ఆ కూటమికి కాస్త ఎక్కువే వస్తాయని తెలిపాయి.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.