• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ELECTION COMMISSIONER IN WEST BENGAL TRANSFERS POLICE COMMISSIONERS IN WEST BENGAL MK

పశ్చిమ బెంగాల్‌లోనూ కీలక ఐపీఎస్ అధికారుల బదిలీ...ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశం...

పశ్చిమ బెంగాల్‌లోనూ కీలక ఐపీఎస్ అధికారుల బదిలీ...ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశం...

పశ్చిమ బెంగాల్ లోనూ పలువురు కీలక అధికారులు బదిలీలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులను ఎన్నికల విధులకు సైతం దూరంగా ఉంచాలని పేర్కొనడం విశేషం.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీ బదిలీ పర్వం మరవకముందే, అటు పశ్చిమ బెంగాల్ లోనూ పలువురు కీలక అధికారులు బదిలీలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులను ఎన్నికల విధులకు సైతం దూరంగా ఉంచాలని పేర్కొనడం విశేషం. బదిలీ అయిన అధికారుల విషయానికి వస్తే కోల్ కతా, బిధాన్నగర్ పోలీస్ కమిషనర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే అధికారుల బదిలీ విషయంలో ఎలక్షన్ కమిషన్ తీరుపై అటు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. బదిలీల వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో సైతం పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అంతే కాదు తాజాగా ఏకంగా ఏపీ సీఎస్ ను సైతి బదిలీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పై విమర్శలు చేశారు. తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు బెదిరిస్తున్నారని, ఎన్నికలకు ముందు బదిలీలు దేనికి సంకేతమని చంద్రబాబు విమర్శించారు.

    Published by:Krishna Adithya
    First published: