Huzurnagar Bypoll | ఈసీ కీలక నిర్ణయం.. సూర్యాపేట ఎస్పీ బదిలీ..

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఇటీవల తెలంగాణ జనసమితి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: October 4, 2019, 6:11 PM IST
Huzurnagar Bypoll | ఈసీ కీలక నిర్ణయం.. సూర్యాపేట ఎస్పీ బదిలీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈనెల 21న జరగనున్న హూజూర్‌నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. ఆయన స్థానంలో భాస్కరన్‌ను ఎస్పీగా నియమించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని, సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలంటూ తెలంగాణ జనసమితి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈసీ సూర్యాపేట ఎస్పీని బదిలీ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన టూర్‌లో ఉన్న సమయంలోనే సూర్యాపేట ఎస్పీని ఈసీ బదిలీ చేయడం విశేషం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫన పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, బీజేపీ తరఫున రామారావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు పలికింది. కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ బాసటగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలంటూ జనసేనను హస్తం నేతలు అభ్యర్థించారు. అయితే, జనసేనాని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

మరోవైపు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓ పరిశీలకుడిని కూడా నియమించింది. 1983 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి బీఆర్ బాలకృష్ణన్‌ను హుజూర్‌నగర్ ఉప ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక పారదర్శకంగా నిర్వహించేందుకు మద్యం డబ్బు పంపిణీని అరికట్టడం, ఫిర్యాదుల పరిశీలన, ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం సేకరణ, ఓటింగ్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 4, 2019, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading