రేపు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం

నామినేషన్ ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శుక్రవారం ఈ సమావేశం జరగనుంది.

news18-telugu
Updated: November 8, 2018, 5:44 PM IST
రేపు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం
రజత్ కుమార్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: November 8, 2018, 5:44 PM IST
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు, ప్రచార తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్... శుక్రవారం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. రాష్ట్రంలోని తొమ్మిది ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఈసీ నిర్వహించనున్న సమావేశం కీలకంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఈసీ రజత్ కుమార్ నేతృత్వంలో జరగునున్న ఈ సమావేశంలో పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి.

ఇప్పటికే ఎన్నికల ప్రచార సరళిపై ఓ కన్నేసి ఉంచిన ఎలక్షన్ కమిషన్ .. పార్టీలకు పలు సూచనలు చేయనుంది. ఎన్నికల ఏర్పాట్లపై సలహాలను స్వీకరించనుంది. ఇప్పటికే కోడ్ ఉల్లంఘనకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందిన విషయాన్ని పార్టీల ముందు ఎన్నికల కమిషన్ ప్రస్తావించనుంది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించనుంది.

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...