చంద్రబాబు సమీక్షలపై ఈసీ సీరియస్.. హోంశాఖ సమీక్ష రద్దు

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చంద్రబాబు సమీక్షలు నిర్వహించడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది.

news18-telugu
Updated: April 18, 2019, 4:28 PM IST
చంద్రబాబు సమీక్షలపై ఈసీ సీరియస్.. హోంశాఖ సమీక్ష రద్దు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం, సీఆర్డీఏ మీద సమీక్ష నిర్వహించడం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల మీద నిర్వహించాల్సిన హోం శాఖ సమీక్షను చంద్రబాబునాయుడు రద్దు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల మీద హోంశాఖ సెక్రటరీ అనురాధ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికారులు ఏం చేయాలి? ఏం చేయకూడదని తెలిపే నిబంధనలను అందులో వివరించారు.

పోలింగ్ తర్వాత మళ్లీ పాలనా పరమైన వ్యవహారాలపై దృష్టి పెడతానని చంద్రబాబు తెలిపారు. పోలవరం మీద ఈనెల 17న సమీక్ష జరిపారు. రాష్ట్రంలో తాగునీటి అంశం మీద సమీక్షించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించడంపై కొన్ని పార్టీలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం చంద్రబాబు సూచనలు చేయొచ్చు కానీ, ఏకంగా సమీక్షలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

 

First published: April 18, 2019, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading