తెలుగు రాష్ట్రాల ఎంపీలకు షాక్... ఎన్నిక రద్దు చేస్తామని ఈసీ వార్నింగ్

80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. వీరిలో 15 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు.

news18-telugu
Updated: February 4, 2020, 12:19 PM IST
తెలుగు రాష్ట్రాల ఎంపీలకు షాక్... ఎన్నిక రద్దు చేస్తామని ఈసీ వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఓ ఘాటైన వార్నింగ్ పంపింది. ఎన్నికలు పూర్తయి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారు ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదని సీరియస్ అయ్యింది. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు అందించని 80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. వీరిలో 15 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు.

వీరు ఎలక్షన్‌లో గెలిచిన 90 రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సమర్పించకపోవడంతో ఈసీ మండిపడింది. వెంటనే ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలు అందించకపోతే..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాంటి ఎంపీలపై చర్యలు తీసుకునే హక్కు ఉందని ఈసీ వార్నింగ్ ఇచ్చింది. అఫిడవిట్ దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉంది. అయితే కొందరు ఎంపీలు మాత్రం తమ అధిక ఎన్నికల ఖర్చుల విషయం ఎక్కడ బయటపడుతుందనే ఆందోళనలు ఉన్నట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థులు 45 రోజుల్లో అఫిడివిట్ ఇవ్వాలని.... ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వివి రావు తెలిపారు.

First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు