మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు... షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం

Rajya Sabha Elections 2020: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

news18-telugu
Updated: February 25, 2020, 9:56 AM IST
మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు... షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
అయితే ఈసారి రెండు సభలు ఒకేసారి సమావేశం అయ్యే పరిస్థితులు లేవు. ఒక సభ ఉదయం, ఒక సభ సాయంత్రం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • Share this:
దేశంంలో మరో ఎన్నికల నగారా మోగింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో కేవీపీ, గరికాపాటి రాంమోహన్ రావు పదవీకాలం ముగుస్తుంది. అటు ఏపీలో కూడా కే కేశవరావు, ఏంఏ ఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, తోట సీతరామలక్ష్మీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఆయా స్థానాలకు  ఎన్నికలు నిర్వహించనున్నారు. 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Published by: Sulthana Begum Shaik
First published: February 25, 2020, 9:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading