కరోనా దెబ్బకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..

Rajya Sabha Elections : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: March 24, 2020, 12:47 PM IST
కరోనా దెబ్బకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
అయితే ఈసారి రెండు సభలు ఒకేసారి సమావేశం అయ్యే పరిస్థితులు లేవు. ఒక సభ ఉదయం, ఒక సభ సాయంత్రం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • Share this:
Rajya Sabha Elections : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తామనేది మార్చి 31 తర్వాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జన సమూహం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల్లో.. ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్లు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారంతా గుమిగూడాల్సి వస్తుంది. వారిలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా.. అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, అందుకే.. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 24, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading